
ఐదు దశాబ్దాల దోస్తానా..
నల్లగొండ టూటౌన్: వారిద్దరిది ఒకే ఊరు. అదే ఊళ్లో ప్రభుత్వ బడిలో చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువులు చదివి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఒకటో తరగతిలో మొదలైన వారి స్నేహం గత 53 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన కందుకూరి వెంకటేశ్వర్లు, పసుపులేటి జయపండరి ఒకటో తరగతి నుంచి స్నేహితులు. కందుకూరి వెంకటేశ్వర్లు ప్రస్తుతం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రజారోగ్య ఎస్‌ఈగా పనిచేస్తుండగా.. పసుపులేటి జయపండరి నల్లగొండలోనే ఆర్మ్‌డ్ రిజర్వ్ ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఉద్యోగ రీత్యా గతంలో వీరు వేర్వురు జిల్లాల్లో పనిచేసినప్పటికీ నెలలో రెండుసార్లు తప్పనిసరిగా కలుస్తూ ఇరువురి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకునేవారు. తాము ఎప్పుడు కలిసినా ఊరి గురించి, అక్కడి ప్రజల గురించి వాకబు చేస్తూ గంటల కొద్ది గడుపుతామని వారిద్దరు తెలిపారు. తమ స్నేహం చిరస్థాయిగా నిలిచిపోయేదని పేర్కొన్నారు.

ఐదు దశాబ్దాల దోస్తానా..

ఐదు దశాబ్దాల దోస్తానా..