కోదాడ : మంత్రిప్రగడ భరతరావు, శ్రీరామవచం వెంకటేశ్వర్లు ఇద్దరూ ఆరు దశాబ్దాలుగా కలిసి నడుస్తూ స్నేహమంటే ఇదేరా అన్నట్లు ఉంటున్నారు. హూజూర్‌నగర్ ప్రాంతంలోని లకారం గ్రామానికి చెందిన భరతరావు, పక్కన గ్రామమైన లింగగిరికి చెందిన శ్రీరామకవచం వెంకటేశ్వర్లు 1968లో కోదాడ కేఆర్‌ఆర్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న కాలం నుంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇద్దరు అదే కళాశాల నుంచి ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత ఇద్దరు మరో 15 సంవత్సరాలు కోదాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేశారు. ఇటీవలే వారు ఆ ఉద్యోగాలను మానేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు మీరు ఇంత స్నేహంగా ఉండడానికి కారణమేంటని ఎవరైనా.. అడిగితే అది వారి గొప్పతనమే.. అటూ ఒకరి గురించి ఒకరు కితాబునిచ్చుకుంటారే తప్పా నేనే అనిమాత్రం చెప్పుకోరు. పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవడమే స్నేమబంధం పదికాలాలపాటు నిలిచి ఉండడానికి పునాది అని వారు ఎప్పుడూ చెపుతుంటారు.
స్నేహానికి అరవై వసంతాలు