
‘సిల్వర్ జూబ్లీ’ స్నేహం
నిడమనూరు: ఏపీలోని కర్నూల్ జిల్లాలో గల సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో 2000 సంవత్సరంలో మొదలైన వారిద్దరి స్నేహానికి ఈ ఏడాదితో సిల్వర్ జూబ్లీ(25 వసంతాలు) పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం శాఖాపురం గ్రామానికి చెందిన వల్లపుదాసు సత్యనారాయణ, ఏపీలోని ప్రస్తుత ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన బాలిన వెంకట్‌రావు 2000 సంవత్సరంలో కర్నూల్‌లోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(బయో కెమెస్ట్రీ) చదువుతుండగా స్నేహితులయ్యారు. వీరిద్దరూ ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి బీఈడీ చేసినప్పటికీ.. మెడికల్ రిప్రజెంటివ్‌గా ఉద్యోగాలు ప్రారంభించి, ప్రస్తుతం మార్కెటింగ్ జనరల్ మేనేజర్లుగా కొనసాగుతున్నారు. 25 ఏళ్లు అవుతున్నా, వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ ఇప్పటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ శ్రీసిల్వర్ జూబ్లీశ్రీ జరుపుకుంటున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో అప్పుడప్పుడు కలుసుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

‘సిల్వర్ జూబ్లీ’ స్నేహం