
రాజకీయ రంగు అంటని స్నేహ బంధం
నిడమనూరు: నిడమనూరు మండల కేంద్రానికి చెందిన బొల్లం బాలయ్య, శేషరాజు భిక్షమయ్య వయస్సు 70సంవత్సరాల పైనే ఉంటుంది. బొల్లం బాలయ్య యాదవ సామాజిక వర్గంలో పెద్ద రైతుగా, పెద్దమనిషిగా గుర్తింపు పొందారు. శేషరాజు భిక్షమయ్య రాజకీయాలతో పాటు వ్యాపారం, వ్యవసాయం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి స్నేహితులైన వీరిద్దరు ఎన్నో పర్యాయాలు గ్రామ సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. నిడమనూరు సర్పంచ్‌గా 2007లో వీరిద్దరితో పాటు మరికొందరు పోటీపడగా.. బొల్లం బాలయ్య 95 ఓట్లతో నిడమనూరు సర్పంచ్‌గా గెలుపొందారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులుగా పోటీ పడినప్పటికీ ఎన్నికల అనంతరం కొన్నిరోజులకే వారు తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించారు. ఇప్పటికీ వారిద్దరు ప్రతినిత్యం ఆరోగ్యం, వ్యవసాయం, రాజకీయాల గురించి చర్చిస్తుంటారు.

రాజకీయ రంగు అంటని స్నేహ బంధం