
తప్పుడు పత్రాలపై విచారణ
మోత్కూరు: తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందిన ఘటనపై తహసీల్దార్ జ్యోతి శుక్రవారం విచారణ చేపట్టారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి వెళ్లి వల్లపు సోమలక్ష్మమ్మ కుటుంబ సభ్యులను విచారణ చేశారు. లక్ష్మమ్మ కూతురు రాధిక వివాహం 2011లో వలిగొండ మండలం మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మహేష్‌తో జరిగిందని, వారికి ఏడేళ్ల వయసున్న కుమారుడు, ఐదు సంవత్సరాల కుమార్తె ఉన్నట్లు విచారణలో తేలింది. తప్పుడు పత్రాలతో లబ్ధి పొందినట్లు రూ.1,00,116 లబ్ధి పొందినట్లు గుర్తించారు. లబ్ధిపొందిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించినట్లు తహసీల్దార్ తెలిపారు.