
ఫ శాఖాంబరిగా..
ఏఐ తరగతులను ప్రారంభించాలి : డీఈఓ
రామన్నపేట: అందుబాటులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తరగతులు ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.సత్యనారాయణ సూచించారు. శుక్రవారం రామన్నపేట మండలం ఇస్కిళ్లలోని గుండా సత్తయ్య మెమోరియల్ ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బేస్‌లైన్ టెస్ట్ ఫలితాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.వలంటీర్లు సహకారంతో ఫ్రీప్రైమరీ తరగతులు, వెనుకబడిన విద్యార్థులకోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం కక్కిరేణి, ఎన్నారం ప్రాథమికోన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. ఆయనవెంట ప్రధానోపాద్యాయులు శ్రీనివాస్, ఉపేందర్‌జీ తదితరులు ఉన్నారు.

ఫ శాఖాంబరిగా..