
రూ.19.24 కోట్లు మాఫీ
సాక్షి,యాదాద్రి : జిల్లాలో 2,380 చేనేత కార్మికులకు రూ.19.24 కోట్ల రుణమాఫీ కానుందని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో రుణమాఫీ జాబితాను అమోదించి రాష్ట్ర కమిటీకి నివేదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017 ఏప్రిల్ 1నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు రుణాలు తీసుకున్న చేనేత కార్మికుల ఆధారంగా జాబితా రూపొందించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 39 బ్యాంకుల్లో 2,380 మంది కార్మికులు రుణాలు పొందారని వెల్లడించారు. సమావేశంలో ఆర్‌డీడీ పద్మ, లీడ్‌బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ జిల్లా ఇంచార్జ్ అధికారిగా సాహితి
భువనగిరిటౌన్ : ఉపాధి కల్పన జిల్లా అధికారి సాహితి బీసీ సంక్షేమ జిల్లా ఇంచార్జ్ అధికారిగా నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి యాదయ్య ఈ నెల 31న ఉద్యోగ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో సాహితికి శుక్రవారం ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.
ఆర్టీసీ సిబ్బందికి
ప్రగతిచక్ర అవార్డులు
రామగిరి (నల్లగొండ) : విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆర్టీసీ సిబ్బందికి రీజియన్ స్థాయిలో ఏప్రిల్, మే, జూన్ నెలల ప్రగతిచక్ర అవార్డులను ఆర్‌ఎం జానిరెడ్డి శుక్రవారం నల్లగొండలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహిస్తేనే ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందన్నారు. రీజియన్ పరిధిలో 28 మంది సిబ్బందికి ప్రగతిచక్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం, అన్ని డిపోల మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
బీసీ లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: 2025–26 విద్యా సంవత్సరానికి గాను అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ శిక్షణకు బీసీ న్యాయవాద గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలని, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఆగస్టు 15లోగా దరఖాస్తులను జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని, పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

రూ.19.24 కోట్లు మాఫీ

రూ.19.24 కోట్లు మాఫీ