
మందుల కొరత లేకుండా చూడాలి
మోటకొండూర్: ఆస్పత్రుల్లో మందుల కొరత ఉండొద్దని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. కొరత ఉన్న మందులను వెంటనే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యసిబ్బంది హాజరు రిజిస్టర్, రోగుల వివరాల నమోదు, కాన్పుల రికార్డులను పరిశీలించారు. వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడారు.ఆస్పత్రిలో సౌకర్యాలు, వైద్యసేవలు ఎలా ఉన్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని డాక్టర్లను సూచించారు. ఆయన వెంట వైద్యులు విజయ్, మోసెస్ రాజ్, ఎస్‌ఐ అశోక్ ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
భువనగిరి: మండలంలోని కూనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ సామగ్రి ఏ రేట్లకు లభిస్తున్నాయని లబ్ధిదారులను అడిగారు. లబ్ధిదారులకు ఇబ్బందులు ఉంటే వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. మహిళా సంఘాల నుంచి రుణాలు ఇప్పించాలన్నారు. గ్రామానికి మంజూరైన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాలను ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు

మందుల కొరత లేకుండా చూడాలి