
పెరటి తోటల పెంపకంపై అంగన్‌వాడీలకు అవగాహన
గరిడేపల్లి: గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో పెరటి తోటల పెంపకంపై అంగన్‌వాడీ టీచర్లకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త డి. నరేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లల్లో పోషక ఆహార సమస్యలు, దానికి అవసరమైన పోషక విలువలు గల పెరటి తోటల పెంపకంపై అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోషకాలు సమృద్ధిగా ఉండే పెరటి తోటల పెంపకం ఎలా చేయాలో వివరించారు. అనంతరం తొమ్మిది రకాలు కూరగాయల సీడ్ కిట్స్‌ను అంగన్‌వాడీ టీచర్లకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్త సీహెచ్. నరేష్, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎన్. సుగంధి, హుజూర్‌నగర్ సీడీపీఓ వెంకటలక్ష్మి, మండల ఇచ్‌చార్జి రేవతి, కేవీకే శాస్త్రవేత్త అక్షిత్ పాల్గొన్నారు.