
ప్రయాణం హాయిగా..
రూ.161.48 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి
● భువనగిరి – చిట్యాల రోడ్డుకు భువనగిరి నియోజకవర్గ పరిధిలో రూ.28 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో భువనగిరి, నాగిరెడ్డిపల్లి, టేకులసోమారం, వలిగొండ, నాగారం, తుమ్మలగూడెం, బోగారం, రామన్నపేట వరకు రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ఇదే రహదారికి నకిరేకల్ నియోజవర్గ పరిధిలో రూ.15.60 కోట్లు కేటాయించారు. ఈ మార్గం యాదాద్రి, నల్లగొండ జిల్లాల పరిధిలో జాతీయ రహదారుల తరువాత అత్యంత రద్దీగా ఉంటుంది. దక్షిణ– ఉత్తర భారతదేశం మధ్య వివిధ ప్రాంతాలకు ప్రధాన వారధి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే రహదారి అభివృద్ధి జరిగితే ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తక్కువ వ్యవధిలో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
సాక్షి, యాదాద్రి: ఛిద్రమైన రోడ్లతో నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులకు ఊరట లభించనుంది. ఆర్‌అండ్‌బీ రహదారుల ఉన్నతీకరణ కోసం ప్రత్యేక ప్యాకేజీలో జిల్లాకు ప్రభుత్వం రూ.161.48 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో సింగిల్ రోడ్లను డబుల్ లేన్‌గా, డబుల్ రోడ్లను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటు కల్వర్టులు, వంతెనలు, డివైడర్ల నిర్మాణం, ప్రమాదాల నివారణకు మూలమలుపుల వద్ద సైడ్‌వాల్స్, స్పీడ్ బ్రేకర్లు తదితర చర్యలు చేపట్టనున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో పనులు చేపట్టనున్నారు.
అభివృద్ధి చేయనున్న రోడ్లు,
కేటాయించిన నిధులు
● తుర్కపల్లి నుంచి బొమ్మలరామారం మండలం రంగాపూర్ వరకు రహదారిని రూ.17.18 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. వయా మల్కాపూర్, బద్దుతండా, మాదాపూర్, రామస్వామితండా, చీకటిమామిడి, కాజీపేట, బొమ్మలరామారం మీదుగా రంగాపూర్ వరకు రోడ్డును అభివృద్ధి చేస్తారు. పనులు పూర్తయితే యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లి మీదుగా హైదరాబాద్‌కు రవాణా సౌకర్యం మెరుగుపడి ప్రయాణం సులభతరం కానుంది.
● నాగారం నుంచి వయా ఎస్.లింగోటం, నేలపట్ల, జైకేసారం, నెమలి కాల్వ గ్రామాల మీదుగా చౌ టుప్పల్ వరకు రూ. 6.50 కోట్లు మంజూరయ్యాయి.
● ఆలేరు పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జగ్‌దేవ్‌పూర్ పీడబ్ల్యూడీ రహదారి వరకు వయా రఘునాథపురం, చల్లూరు, ఇబ్రహీంపూర్, వీరారెడ్డిపల్లి వరకు రూ.28.20 కోట్లతో డబుల్ లేన్‌గా విస్తరించనున్నారు.తద్వారా మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాలకు ప్రయాణం సులువుకానుంది.
● ఆలేరు నుంచి వయా సాయిగూడెం, కొల్లూరు, శారాజీపేట, జనగామ జిల్లా జీడికల్ రోడ్డు వరకు రూ.12.50 కోట్లతో పనులు చేపట్టనున్నారు.
● ఆలేరు నుంచి మోత్కూరు వరకు ఉన్న డబుల్ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు.డివైడర్ల రానున్నాయి.
● జనగామ జిల్లా జీడికల్ రోడ్డునుంచి మోత్కూరు వరకు వయా అనంతారం, సుద్దాల, బ్రాహ్మణపల్లి, రామారం, గుండాల మండల కేంద్రం, నుంచి మోత్కూరు వరకు రూ.26 కోట్లు.
● రాయగిరి–మోత్కూరు రోడ్డు నుంచి బండసోమారం,చందుపట్ల మీదుగా భువనగిరి – చిట్యాల రోడ్డు వరకు రూ.15.50 కోట్లు.
● మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ నుంచి వలిగొండ మండలం నాగారం వరకు.. వయా ఎస్.లింగోటం, నేలపట్ల, జైకేసారం, వలిగొండ మండలం జాలుకాలువ, నెమిలకాల్వ గ్రామం వరకు రూ.12 కోట్ల మంజూరయ్యాయి. చౌటుప్పల్ నుంచి వలిగొండ మీదుగా భువనగిరి వరకు ప్రధాన రహదారి ఇది. నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉంది.
ఫ హ్యామ్ విధానంలో చేపట్టనున్న ప్రభుత్వం
ఫ పనులకు త్వరలో టెండర్లు
ఫ మారనున్న పట్టణ, గ్రామీణ రహదారుల రూపురేఖలు

ప్రయాణం హాయిగా..

ప్రయాణం హాయిగా..