
బాట కబ్జా చేశారని ఫిర్యాదు
బావుల వద్దకు వెళ్లే బాటను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని భువనగిరి మండలం యర్రంబెల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 119,95లో తాతల కాలం నుంచి ఉన్న నక్షదారిని ఆక్రమించడంతో సుమారు 30 మంది రైతులం ఇబ్బంది పడుతున్నామని, ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ నెల 27న ఒక వ్యక్తి మృతిచెందగా బునాదిగాని కాలువ పక్కనుంచి చుట్టూ తిరిగి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, రికార్డుల ప్రకారం బాట చూపించాలని కోరారు.