తేలిన చేనేత రుణమాఫీ లెక్క | - | Sakshi
Sakshi News home page

తేలిన చేనేత రుణమాఫీ లెక్క

Jul 30 2025 6:37 AM | Updated on Jul 30 2025 6:37 AM

తేలిన

తేలిన చేనేత రుణమాఫీ లెక్క

అర్హులుగా 2,355 మంది కార్మికుల గుర్తింపు

సాక్షి, యాదాద్రి : ప్రభుత్వం ప్రకటించిన చేనేత వ్యక్తిగత రుణమాఫీ అర్హుల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్రంలోని నేతన్నల రుణమాఫీ కోసం ప్రభుత్వం ప్రాథమికంగా రూ.33 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏప్రిల్‌ 1, 2017 నుంచి మార్చి 31, 2024 వరకు బ్యాంకుల్లో నేతన్నలు తీసుకున్న రుణాలకు వర్తిస్తుంది. ఈ కటాఫ్‌ తేది ఆధారంగానే జిల్లాలోని బ్యాంకుల వారీగా అప్పులున్న నేతన్నల వివరాలను జిల్లా యంత్రాంగం సేకరించింది. కలెక్టర్‌ అధ్యక్షతన గల జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో లబ్ధిదారులు, మాఫీ మొత్తాన్ని ఆమోదిస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీలో రుణమాఫీ ఆమోదం పొందగానే నేతన్నలకు రుణమాఫీ లబ్ధి చేకూరనుంది.

2,355 మందికి రూ.18.87 కోట్ల వరకు..

జిల్లాలో 2,355 మంది చేనేత కార్మికులు అర్హులుగా అధికారులు లెక్కతేల్చారు. రూ.లక్ష వరకు వీరందరికి వర్తించే రుణమాఫీ మొత్తం రూ.18.87 కోట్లుగా తేలింది. అయితే రూ లక్ష కంటే ఎక్కువ ఎంత అప్పు ఉన్నా వారికి ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.లక్ష వరకు మాఫీకానుంది. ప్రాథమిక అంచనా ప్రకారం రుణాలు తీసుకున్న నేతన్నల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలోని 40 బ్యాంకుల నుంచి జౌళి శాఖ అధికారులు వివరాలను సేకరించారు. బ్యాంకులు ఇచ్చిన జాబితా ఆధారంగా వ్యక్తిగత రుణం మాఫీ కానుంది. అత్యధికంగా భూధాన్‌ పోచంపల్లిలో 900 మంది. పుట్టపాకలో 500 మంది, చౌటుప్పల్‌లో 250 మంది. ఆలేరులో 150 మందితోపాటు జిల్లా వ్యాప్తంగా రుణమాఫీకి అర్హులను అధికారులు గుర్తించారు.

ఆగస్టు 1న బ్యాంకర్ల సమావేశం

జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఆగస్టు 1న జిల్లాస్థాయిలో బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. సభ్యులుగా ఉన్న డీసీసీబీ సీఈఓ, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ ఆర్‌డీడీ, ఎల్‌డీఎం, డీజీఎం నాబార్డ్‌, జీఎం ఇండస్ట్రీస్‌, జిల్లా కోఆపరేటీవ్‌ ఆడిట్‌ అధికారి, జిల్లా జౌళి శాఖ అధికారి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రుణగ్రస్తుల జాబితాను ఆమోదించి రాష్ట్ర స్థాయి కమిటికీ పంపిస్తారు. అక్కడా ఆమోదంలభించిన వెంటనే నేతన్న ఖాతాల్లో రుణమాఫీ చేస్తారు.

బ్యాంకుల వారీగా వివరాలు సేకరించాం..

జిల్లాలో చేనేత రుణమాఫీ లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. రూ.లక్షలోపు రుణం తీసుకున్న నేతన్నల వివరాలను బ్యాంకుల వారీగా తీసుకున్నాం. పూర్తిగా చేనేత కోసం వ్యక్తిగత రుణం తీసుకున్న వారే 2,355 మంది అర్హులు ఉన్నారు. వీరికి రూ. 18.87 కోట్లు మాఫీ అవుతాయి.

– శ్రీనివాస్‌, ఏడీ, జౌళి శాఖ

జాబితా సిద్ధం చేసిన అధికారులు

రూ.లక్ష వరకు మాఫీ కానున్న

వ్యక్తిగత రుణం

జిల్లాలో రూ.18.87 కోట్ల వరకు మాఫీకి అవకాశం

తేలిన చేనేత రుణమాఫీ లెక్క1
1/1

తేలిన చేనేత రుణమాఫీ లెక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement