
ముందస్తుగానే.. కృష్ణమ్మ పరవళ్లు
26 క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్ : సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. 18 ఏళ్ల తర్వాత జూలై మాసంలో 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడం.. సాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి మూడు అడుగుల దూరంలో ఉండడంతో మంగళవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారని ఆయా మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పర్యాటకులు మంగళవారం సాగర్‌కు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టు పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. క్రస్ట్‌గేట్ల నుంచి నీరు కిందకు దుమికే దృశ్యాలను తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు.