
‘గంధమల్ల’ను పూర్తిచేస్తాం
● మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఆలేరు: జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్‌ను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి, ఆలేరు నియోకవర్గ రైతాంగానికి సాగునీరు అందిస్తామని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆలేరు పట్టణంలో ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రిజర్వాయర్ పూర్తికి రూ.600 కోట్ల నిధులు కేటాయించామన్నారు. భూసేకరణ కోసం రైతులకు చెల్లించేందుకు అదనంగా రూ.27కోట్ల నిధులు ఇరిగేషన్ శాఖ నుంచి త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆలేరులో కొత్తగా 7వేల మందికి రేషన్‌కార్డులను జారీ చేశామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యన్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పేదల ఆత్మగౌరవానికి ప్రతీక రేషన్‌కార్డుల పంపిణీ అన్నారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడమే తన చిరకాల కల అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే ఐలయ్య గొర్రెపిల్లను బహూకరించారు. అనంతరం మంత్రులను ఎమ్మెల్యే, కలెక్టర్‌లు సన్మానించారు. రెవన్యూ డివిజన్‌గా ఆలేరును ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు మంత్రికి వినతి అందజేశారు.
గొర్రెపిల్ల నాకేనా.. : ఉత్తమ్
బహూకరించిన గొర్రెపిల్లను నాకేనా. మీకా అని మంత్రి ఉత్తమ్ సమావేశంలో ఎమ్మెల్యేతో చమత్కారించారు. అదనపు కలెక్టర్ మా నియోజకవర్గ ఓటరే.. కలెక్టర్ మన జిల్లా వాసే అని మంత్రి సరదాగా మాట్లాడి నవ్వులు చిందించారు.