
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి వెల్లడించాలి
చౌటుప్పల్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ వైఖరిని తక్షణమే వెల్లడించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. మంగళవారం చౌటుప్పల్‌లో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ విస్త్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో బీజేపీ మద్దతు ఇచ్చినప్పటికీ కేంద్రంలో మాత్రం అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ మూలంగా బీసీలు నష్టపోతున్నారని తెలిపారు. నాన్చుడు ధోరణిని విడనాడాలని డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమ బాధితులకు ఇప్పటికీ పరిహారం అందివ్వకపోవడం సరికాదన్నారు. తక్షణమే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, మల్లేశం, పెంటయ్య, గోశిక స్వామి, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాస్‌చారి, ఎండి.పాషా, గంగదేవి పాండు, గోశిక కరుణాకర్, రాగీరు కిష్టయ్య పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ
సభ్యుడు వీరయ్య