
సాగర్‌లో పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో పర్యాటకులు క్యూ కట్టారు. సాగర్ అందాలను పర్యాటకులు తమ సెల్‌ఫోన్‌లలో బంధిస్తూ, సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం వద్ద, కొత్త బ్రిడ్జిపై పర్యాటకులు కిటకిటలాడారు. పర్యాటకుల రాకతో సాగర్ తీరంలో చిరువ్యాపారులు బత్తాయి జ్యూస్, ఐస్ క్రీమ్, మొక్కజొన్న కంకులు, చిప్స్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నారు.
డౌన్ పార్కుకు మారిన లాంచీ స్టేషన్..
లాంచీ స్టేషన్ విజయవిహార్ నుంచి డౌన్ పార్కుకు మార్చారు. గతంలో డౌన్ పార్కు వద్దే లాంచీ స్టేషన్ ఉండగా.. ఇక్కడ వాహనాలు నిలిపేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో విజయవిహార్ వెనుక భాగంలో నూతనంగా నిర్మించిన లాంచీ జట్టీ నుండే లాంచీలను నడుపుతూ విజయవిహార్‌లో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లాంచీ స్టేషన్ డౌన్‌పార్కుకే మార్చడంతో పర్యాటకులు ఆగకుండా వెంటనే లాంచీ ఎక్కి వెళ్లేందుకు కొంత అనువుగా ఉంది. ఈ సీజన్ పూర్తయ్యే వరకు ఇక్కడి నుండే లాంచీలను నడపనున్నారు.
కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు
సెల్ఫీలు దిగుతూ ఆనందంగా
గడిపిన పర్యాటకులు
చిరు వ్యాపారులకు పెరిగిన గిరాకీ

సాగర్‌లో పర్యాటకుల సందడి

సాగర్‌లో పర్యాటకుల సందడి