
నృసింహుడి ఆలయ భూముల సర్వే
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల పరిరక్షణపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా శనివారం డీజీపీఎస్ (డిఫరెన్సియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సర్వే చేపట్టారు.స్వామివారికి యాదగిరిగుట్ట పట్టణంతో పాటు పాతగుట్ట, వైటీడీఏ పరిధిలోని టెంపుల్ సిటీ, మల్లాపురం, రాయగిరి, దాతరుపల్లి, సైదాపురం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. వీటన్నింటినీ సర్వే చూసి హద్దులు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. నాలుగు రోజుల పాటు కొనసాగనుందని తెలిపారు. సర్వేలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ భాస్కరశర్మ, తహసీల్దార్ గణేష్, దేవస్థానం, మున్సిపల్ అధికారులు దయాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వైటీడీఏ సీబ్బంది పాల్గొన్నారు.