
ఉపవాసంతో పూజలు చేస్తాం
తీజ్ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు నిష్టతో జాగరణలో ఉంటూ పూజలు చేస్తాం. ఉత్సవాలు ముగిసే వరకు తండాను వదిలి బయటికి వెళ్లం. చివరిరోజు పూర్తిగా ఉపవాసంతో ఉంటాం. తండా పెద్దలు, తల్లిదండ్రులు, సోదరుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తాం.
– రమావత్ అనిత, తిరుమలగిరిసాగర్ మండలం
తండా అంతా ఒక్కటిగా జరుపుకుంటాం
తీజ్ పండుగను తండావాసులంతా కలిసి జరుపుకుంటాం. పంటలు బాగా పండాలని అమ్మవార్లకు పూజలు చేస్తాం. గోధుమ నారును తెంచి కుటుంబ సభ్యులకు ఇచ్చి, అమ్మవారి దీవెనలు అందుకుంటాం. చివరి రోజున చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. – నీలా బాయి, తుర్కపల్లి మండలం

ఉపవాసంతో పూజలు చేస్తాం