
కొత్త బ్రిడ్జిపై ట్రాఫిక్‌జాం
బుధవారం సాయంత్రం పర్యాటకుల వాహనాలు ఒక్కసారిగా ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులోని కొత్త బ్రిడ్జి పైకి రావడంతో ఎదురుగా వచ్చిన లారీ ఆగిపోయింది. దీంతో ట్రాఫిక్‌జాం అయ్యింది. పోలీసులు స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వంతెనపై వాహనాలు వరుస క్రమంలో వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కొత్త బ్రిడ్జిపై పర్యాటకులు వాహనాలు నిలుపకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అంతేకాకంఉడా దయ్యాలగండి వద్ద గల పుష్కరఘాట్ సమీపంలో పర్యాటకులు రోడ్డు వెంట వాహనాలు నిలిపి సాగర్ జలాశయంలోకి దిగుతున్నారు. అక్కడ పోలీసు పహారా ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.