
కల్తీ కల్లు తయారీ ముడిసరుకు పట్టివేత
నార్కట్‌పల్లి: కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఆటోలో తరలిస్తుండగా మంగళవారం రాత్రి నార్కట్‌పల్లి బైపాస్ వద్ద ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం నల్లగొండ ఎకై ్సజ్ సీఐ బుర్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కట్టంగూర్‌కు కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఆటోలో తీసుకెళ్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో మంగళవారం రాత్రి నార్కట్‌పల్లి బైపాస్‌లో ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఆటోలో 30 కిలోల కోరల్‌హైడ్రేట్‌తో పాటు ఇతర ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. కట్టంగూర్ నుంచి ఈ ముడిసరుకును సూరత్, గుజరాత్‌కు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జెరిపోతుల వెంకన్నపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.