
మాకు ఇండ్లు కావాలే..
మా ఇళ్లు ఎప్పుడో కట్టినవి.. భారీ వర్షాలు కురుస్తే కూలిపోయే స్థితిలో ఉన్నాయి.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన పలువురు మహిళలు అదనపు కలెక్టర్లను వేడుకున్నారు. ఇళ్లు శిథిలావస్థలో ఉండటంతో ప్రస్తుతం కొందరం గుడిసెలో, కమ్యూనిటీ హాల్‌లో, మరికొందరం కిరాయికి ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు కూడా తమ సమస్య తెలియజేశామన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు వారికి అనుకూలంగా ఉన్న వారికే ఇళ్లు మంజూరు చేశారని, ఎల్–1 జాబితాలో మా పేర్లు ఉన్నందున తమకు కూడా వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని వేడుకున్నారు.