
అన్నదాతకు యంత్ర సాయం
నాలుగు కేటగిరీల కింద
మంజూరైన పరికరాలు
పంటలను రక్షించేవి : బ్యాటరీతో నడిచే, కాలుతో తొక్కే యంత్రాలు 1,291, కాలుతో తొక్కేవి, చేతితో స్ప్రే,పెట్రోల్‌తో నడిచే పంపులు 206
ట్రాక్టర్ పరికరాలు : రోటోవేటర్లు 63, విత్తనాలు, ఎరువులు వేసే పరికరం 17, కల్టివేటర్లు, ప్లవ్‌లు, కేజీ వీల్స్ 61, వరాలు తీసే పరికరం (పీటీఓ) 4, నాన్ పీటీఓ 4
రైతు స్వయంగా ఆపరేట్ చేసేవి : పవర్ వీడర్ 8, బ్రష్‌కట్టర్ 17, పవర్ టిల్లర్ 12
కోతకోయడానికి : గడ్డికట్టలు కట్టే యంత్రం 18 యూనిట్‌లు మంజూరయ్యాయి.
రామన్నపేట: అన్నదాతకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందనున్నాయి. 2025–25 సంవత్సరానికి గాను జిల్లాకు 1,701 యూనిట్‌లు మంజూరయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,27,44,664 కేటాయించింది. చిన్న, సన్నకారు రైతులు, విద్యుత్ లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాంత్రీకరణ పెంచడం, తక్కువ భూ విస్తీర్ణం కలిగిన రైతులు సైతం యంత్ర పరికరాలు కలిగిఉండి సాగును ప్రోత్సహించడం, గ్రామాల్లో కస్టం హైరింగ్ సెంటర్లు (వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇచ్చే సంస్థ) ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తున్నాయి. జిల్లా కేటాయించిన యంత్రాలు, పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు.
అర్హతలు ఇవీ..
రూ.లక్షకు పైగా విలువ చేసే యంత్రం పొందగోరే రైతు ఎకరం, రూ.లక్షలోపు విలువ చేసే యంత్రానికి ఎకరం లోపు భూమి కలిగి ఉండాలి. సీహెచ్‌సీలోని సభ్యుల(ఐదుగురు)కు కనీసం 2.5 ఎకరాలు ఉండాలి. సభ్యులు ఒకే కుటుంబానికి చెందినవారై ఉండకూడదు.
ఆగస్టు 15వరకు ఆమోదిస్తేనే..
వ్యవసాయ విస్తరణ అధికారులు ధరఖాస్తులు స్వీకరించి, ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఎఫ్‌ఎం ఫోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆగస్టు 5వ తేదీలోగా లబ్ధిదారుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలి. ఎంపిక కమిటీ ఆగస్టు 15వరకు జిల్లాస్థాయిలో లబ్ధిదారులను గుర్తించి అమోదించవలసి ఉంటుంది.
ఫ రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు
ఫ జిల్లాకు 1,701 యూనిట్లు కేటాయింపు
ఫ ఆగస్టు 15లోపు లబ్ధిదారుల ఆమోదం