సర్వేల్ గురుకులంలో 100శాతం ఉత్తీర్ణత
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. 85మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 85మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సండ్ర స్వాతిక్ 600 మార్కులకు గాను 555 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలువగా, 540పైగా మార్కులు సాధించిన వారు 15మంది విద్యార్థులున్నారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్‌కుమార్ అభినందించారు.
నృసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ద్యిక్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు, ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికిశయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
సర్వేల్ గురుకులంలో 100శాతం ఉత్తీర్ణత


