మాట్లాడుతున్న ఎంపీపీ నరాల నిర్మల
భువనగిరి: భువనగిరి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం 2019 నవంబర్ నుంచి 2022 మార్చి వరకు నిర్వహించిన ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఎంపీపీ నరాల నిర్మల మాట్లాడుతూ మొత్తం రూ.15.56 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కూలీలు పనిచేసినవి రూ. 11.62 కోట్లు ఉండగా మెటీరియల్ వర్క్‌కు రూ.3.93 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మందడి ఉపేందర్‌రెడ్డి, అడిషనల్ డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జెడ్పీటీసీ బీరు మల్లయ్య, వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి, విజిలెన్స్ అధికారి అదిత్యవర్ధన్, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి అంజన్‌రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఫస్సియుద్దీన్, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, ఏపీఓ పాల్గొన్నారు.


