న్యూస్‌రీల్
గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం అమలు
అత్తిలి మండలం శివపురం చేనేతకు ప్రసిద్ధి. గ్రామంలో 200కు పైగా కుటుంబాలు ఉంటే అధికంగా చేనేత కుటుంబాలే. గ్రామంలో 140 వరకు కుటుంబాలు మగ్గం నేస్తుంటే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హత కలిగిన సుమారు 120 కుటుంబాలకు నేతన్న నేస్తం లబ్ధి చేకూరింది. అదనంగా అమ్మఒడి, చేయూత, పింఛన్ తదితర పథకాల ప్రయోజనం అందింది. కూటమి ప్రభుత్వ హయాంలో చేనేతకు తోడ్పాటు లేక, సంక్షేమం కానరాక నేత కార్మికులు ఇతర పనుల్లోకి వెళ్లిపోతుండటంతో మగ్గాలు మూలకు చేరుతున్నాయి.
కలెక్టరేట్ వద్ద నేతన్నల నిరసన
మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2026
ప్రభుత్వ చేనేత వ్యతిరేక విధానాలతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. కేంద్ర బడ్జెట్‌లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడానికి రూ.25 వేల కోట్లు, రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించాలి. ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలి.
–బళ్ల చినవీరభధ్రరావు, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
ఏడాదికి రూ.25 వేలు, 50 ఏళ్లకే పింఛన్ తదితర ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలుచేయాలి. దివంగత వైఎస్ చేనేతను అన్ని విధాలా ఆదుకున్నారు. ఆయన తనయుడు మాజీ సీఎం జగన్ నేతన్న నేస్తం, ఇతర సంక్షేమ పథకాలతో నేత కార్మికులు అండగా ఉన్నారు.
– వీరా మల్లికార్జునుడు,
వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు
సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పది వేలకు పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. పాలకొల్లు, అత్తిలి, యలమంచిలి, పెంటపాడు, పోడూరు, ఆచంట మండలాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. 50 ఏళ్లకే పింఛన్, రుణమాఫీ, ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా పావలా వడ్డీ రుణాలు, చిలప నూలుపై పది శాతం సబ్సిడీ, ఉచిత వైద్య శిబిరాలు, ఇళ్ల నిర్మాణం తదితర ఎన్నో కార్యక్రమాల ద్వారా చేనేతను ఆదుకున్నారు.
నేతన్నలకు అండగా మాజీ సీఎం జగన్
తండ్రిని మించిన తనయునిగా నేతన్నలకు అండగా నిలిచారు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సొంత మగ్గం ఉన్న వారికి వైఎస్సార్ నేతన్న నేస్తంగా ఏటా రూ.24 వేలు సాయం అందించారు. ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో సరాసరి 1,063 కుటుంబాలకు రూ.12.76 కోట్ల లబ్ధి చేకూరింది. దీనికితోడు అమ్మఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్య శ్రీ వైద్యం తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల ప్రభుత్వ సాయం అందింది.
కూటమి పాలనలో హామీలు గాలికి..
చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తానని, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇస్తానని 2014 ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. 2024 ఎన్నికల్లో కార్మికులకు ఏటా రూ.25 వేలు, 50 ఏళ్లకే పింఛనంటూ ఊదరగొట్టారు. రెండేళ్లుగా ప్రోత్సాహం కరువై చేనేత కుటుంబాలకు పూటగడవడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మగ్గాలకు స్వస్తి చెబుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది కార్మికులు నేత పని వీడి వేరే పనుల్లోకి వెళ్లిపోతున్నారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్టీ మినహాయింపు వంటివి కంటితుడుపు చర్యలుగా కార్మికులు కొట్టిపారేస్తున్నారు.
వినతిపత్రం ఇచ్చిన వైఎస్సార్‌టీయూసీ నాయకులు
కొరుటూరు ప్రాంతానికి వెళుతున్న అటవీ శాఖ సిబ్బంది
ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం
సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం
(రూ.కోట్లలో)
2019–20 996 2.39
2020–21 1,254 3.01
2021–22 899 2.16
2022–23 988 2.37
2023–24 1,027 2.83
చేనేతపై చిన్నచూపు
రెండేళ్లయినా నేతన్నల వైపు కన్నెత్తి చూడని కూటమి సర్కారు
ప్రోత్సాహం లేక మూలకు చేరుతున్న మగ్గాలు
50 ఏళ్లకే పింఛన్, నేతన్న నేస్తం హామీలు గాలికి..
హామీల అమలుకు నేత కార్మికుల డిమాండ్
కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌లో వినతి
నేతన్నలకు అండగా నిలిచిన గత జగన్ సర్కారు
ఉమ్మడి జిల్లాలోని 1,070 కుటుంబాలకు రూ.12.76 కోట్ల సాయం
ఎన్నికల వాగ్దానాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లాలోని చేనేత కార్మిక సంఘం నాయకులు భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఏడాదికి రూ.25 వేల చొప్పున రెండేళ్లకు ఒక్కో కార్మికునికి రూ.50 వేల సాయం అందించాలని కోరారు. వైఎస్ హయాంలో 50 ఏళ్లకే పింఛన్ జీఓ తెచ్చారని, జగన్ ప్రభుత్వం జీఓను అమలుచేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఈ జీఓను తుంగలోకి తొక్కడంతో 50 ఏళ్లు నిండిన కార్మికులు పింఛన్ అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన కార్మికులకు ఏడాదికి పింఛన్ సాయం రూ.48 వేల చొప్పున రెండేళ్లకు రూ.96 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఉపవృత్తుల కార్మికులకు అందజేయాలని, చేనేత రుణాలు మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు అందజేశారు.


