అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను సకాలంలో పరిష్కరించి పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు. భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాస్థాయి అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కార ప్రగతి, ఐగాట్‌ కర్మయోగి కోర్సుల అమలుపై సమీక్షించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తులపై శాఖల వారీగా ఆడిట్‌ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఐగాట్‌ కర్మ యోగి కార్యక్రమంపై సమీక్షిస్తూ ప్రభుత్వ ఉద్యోగులంతా వంద శాతం నమోదు చేసుకోవాలని సూ చించారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్‌ అప్పారావు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ఎన్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పారిశుధ్య నిర్వహణపై.. పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య సంరక్షణ, భూ గర్భ జలాల కాలుష్య నివారణకు సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌, ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ ఏ ర్పాటుకు అవసరమైన స్థలాలను త్వరితగతిన సే కరించి పనులు ప్రారంభించాలని జేసీ ఆదేశించా రు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన అధికారులతో సమీక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement