ఉమ్మడి పశ్చిమలో 32 సహకార కేంద్ర బ్యాంకుల పరిధిలో 262 సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. దాదాపుగా 90 శాతానికిపైగా సొసైటీల్లో కూటమి నేతలే చైర్మన్లుగా ఉన్నారు. అలాగే ప్రతి సొసైటీకి సీఈఓ సహకార శాఖ పరిధిలో పనిచేస్తుంటారు. రైతులకు రుణాలు ఇవ్వడం, ఎరువులు విక్రయించడం ప్రధాన విధిగా సంఘాలు పనిచేస్తుంటాయి. అలాగే సహకార శాఖ షేర్ క్యాపిటల్‌కు అనుగుణంగా, ఎరువుల విక్రయా ల్లోని లాభాలతో సొసైటీల పేరిట కొన్ని వ్యాపారాలు సైతం నిర్వహిస్తుంటారు. కొందరు ఉద్యోగులు వ్యక్తిగత అవసరాలకు కోట్లాది రూపా యలు వాడుకోవడం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. ఎరువుల విక్రయాలు, రుణాల మంజూరులో అవకతవకలు, రైతులు చెల్లించిన రు ణాలు బ్యాంకు ఖాతాల్లో చూపకపోవడం వంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.


