ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిశీలన

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిశీలన అనుమతులు లేని నారాయణ స్కూల్‌ సీజ్‌ వృద్ధురాలి హత్యపైకేసు నమోదు

నూజివీడు: పట్టణంలోని ఎకై ్సజ్‌ స్టేషన్‌ను ఏలూరు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ బీ శ్రీలత, ఏలూరు జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కేవీ నాగ ప్రభుకుమార్‌ సోమవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. గతంలో ఐడీ మద్యం కేసుల్లో నిందితులైన వారందరిపై సెక్షన్‌ 129 బీఎన్‌ఎస్‌ఎస్‌ కింద కేసులు నమోదు చేయాలని, పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. పునరావాస చర్యలతో పాటు వారి కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వ్యక్తులపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేయాలన్నారు. ఎకై ్సజ్‌ సీఐ ఏ మస్తానయ్య పాల్గొన్నారు.

భీమవరం: పట్టణంలోని గునుపూడిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. స్కూల్‌ భవన నిర్మాణం పనులు జరుగుతుండగానే విద్యార్థులకు తరగతులు నిర్వహించడంతోపాటు పుస్తకాలు, విద్యాసామాగ్రి అమ్మకాలు చేస్తుండడంపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గత వారం ఆందోళన చేపట్టగా డీవైఈవో రమేష్‌ స్కూల్‌ను సందర్శించి సీజ్‌ చేశారు. తిరిగి మళ్లీ తరగతులు నిర్వహిస్తుండడంపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎంఈవో శ్రీనివాస్‌ నారాయణ స్కూల్‌ను సందర్శించి సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ భీమవరం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పి.సాయికృష్ణ, ఎస్‌.లక్ష్మణ్‌, సభ్యులు బి సింధు, పి త్రినాథ్‌, జి కౌశిక్‌, జి అభి తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: మండలంలోని తిరుమలాపురం పంచాయతీ వీరన్నగూడెం గ్రామానికి చెందిన రాజనాల దుర్గ (75) హత్యకు గురైనట్లు కేసు నమోదు చేశామని ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. రాజనాల గౌరయ్య ఈ హత్యకు పాల్పడినట్లు హతురాలి కొడుకు రాజనాల దండియ్య సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. రాజనాల గౌరయ్య ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే విడుదలై వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో రాజనాల దుర్గ, కుటుంబసభ్యులతో సహా గౌరయ్య కూడా ఉపాధి పనులకు వెళుత్నుట్లు చెప్పారు. అయితే గౌరయ్య ప్రతి రోజు మద్యం చేవించి రావడంతో దుర్గ మందలించేదన్నారు. దీంతో కక్ష పెట్టుకున్న గౌరయ్య ఈ నెల 13వ తేదీ మధ్యాహ్న సమయంలో దుర్గ నిద్రిస్తుండగా, గొంతు నొక్కి హత్య చేసినట్లు తెలిపారు. అయితే వడదెబ్బ తగిలి దుర్గ మృతిచెందినట్లు భావించిన కుటుంబసభ్యులు, అదే రోజు ఆమె మృతదేహాన్ని దహనం చేసి అంత్యక్రియలు నిర్వహించారన్నారు. అయితే ఈ నెల 21న అనుమానంతో దుర్గ కొడుకు దండియ్య, కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు గౌరయ్యను నిలదీయగా, దుర్గ తనను తిడుతుందని కక్ష పెంచుకుని హత్య చేసినటు ఒప్పుకుని, అక్కడ నుంచి పరారైనట్లు తెలిపారు. కాగా, గౌరయ్య దండియ్యకు బాబాయ్‌ కొడుకు అవుతాడు. అలాగే హతురాలు దుర్గ పెద్దమ్మ అవుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement