పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు దాటినా విద్యార్థులకు టెస్ట్‌బుక్స్, నోటుపుస్తకాలు తప్ప విద్యార్థి మిత్రలో ఇప్పటివరకు ఏమి అందలేదు. గతేడాది ఇచ్చిన యూనిఫామ్, చినిగిన బ్యాగులతోనే పాఠశాలలకు వస్తున్నారు. కొందరు విద్యార్థులకై తే కాళ్లకు చెప్పులు లేకుండానే హాజరవుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు మార్కెట్‌లో కొనుగోలు చేసిన బ్యాగులను తీసుకువస్తున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు గొప్పగా ఉన్నా.. ఆచరణలో మాత్రం శూన్యం అనడానికి ఈ చిత్రాలే ఉదాహరణ. దెందులూరు మండలం కొవ్వలి జడ్పీహైస్కూల్‌లో విద్యార్థుల ఇబ్బందులు ఇవి. –సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు


