ఆటకెక్కించారు! | - | Sakshi
Sakshi News home page

ఆటకెక్కించారు!

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

ఆటకెక్కించారు!

ఏలూరు రూరల్‌ : ఏలూరు డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ (డీఎస్‌ఏ) తిరోగమిస్తోంది. అభివృద్ధి దేవుడెరుగు.. కనీసం క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌లను సైతం నియమించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడు తోంది. ఆటస్థలాలు బాగు చేసేందుకు గ్రౌండ్స్‌మెన్స్‌ను కూడా ఏర్పాటు చేసుకోలేకపోతోంది. దీంతో జిల్లాలో క్రీడా వ్యవస్థ నిరీర్యమవుతోంది. బాలబాలికలకు ఆటలపై ఆసక్తి సన్నగిల్లుతోంది. పర్యవసానంగా రాష్ట్ర, జాతీయస్థాయిల్లో జిల్లాకు ప్రాతిని ధ్యం క్రమేపీ తగ్గుతోంది. ఒకప్పుడు క్రీడా నర్సరీగా పేర్గాంచిన ఏలూరు జిల్లా ప్రస్తుతం శిక్షణ, పోటీల నిర్వహణ, పతకాల సాధనలో అట్టడుగు స్థాయికి చేరిందని సీనియర్‌ క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆవేదన చెందుతున్నారు. స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) నిర్వాకం వల్ల క్రీడా సంఘాలు సైతం నిర్వీర్యమైపోతున్నాయని అంటున్నారు. తక్షణమే శాప్‌ కోచ్‌లు, గ్రౌండ్స్‌మెన్‌ల నియామకం చేపట్టాని డిమాండ్‌ చేస్తున్నారు.

గ్రౌండ్‌మెన్స్‌ లేరు

ఏలూరు ఏఎస్‌ఆర్‌ స్టేడియంలో గ్రౌండ్స్‌మెన్‌ లేరు. రెండేళ్ల క్రితం ఇద్దరు గ్రౌండ్స్‌మెన్స్‌ పదవీ విరమణ చేయగా కనీసం తాత్కాలికంగా అయినా ఎవరినీ నియమించలేదు. ఫలితంగా స్టేడియంలో ఆటస్థలాలు ఎత్తు, పల్లాలుగా మారిపోయాయి. గోతులు, రాళ్లురప్పలు, దుమ్ము, దూళితో కనిపిస్తున్నాయి. మరోపక్క చిన్నపాటి వర్షం కురిసినా స్టేడియంలో రన్నింగ్‌ ట్రాక్‌పై నీరు నిలిచి చిత్తడిగా మారుతోంది. పశువుల సంచారంతో ట్రాక్‌ గోతులమయంగా కనిపిస్తోంది. దీంతో ఉన్న కొద్దిమంది సాధకులు సైతం గాయాలపాలవుతున్నారు. కొన్నిసార్లు క్రీడాకారులే స్వచ్ఛందంగా గ్రౌండ్స్‌ను బాగు చేసుకుంటున్నారు.

క్రీ‘డల్‌’

జిల్లాలో క్రీడా వ్యవస్థ నిర్వీర్యం

కోచ్‌ల కొరత.. గ్రౌండ్‌మెన్స్‌ లేరు

పట్టించుకోని అధికారులు

కోచ్‌లను నియమించాలని క్రీడాభిమానుల డిమాండ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement