ఎంటీఎస్‌ టీచర్ల వినతి | - | Sakshi
Sakshi News home page

ఎంటీఎస్‌ టీచర్ల వినతి

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

ఎంటీఎస్‌ టీచర్ల వినతి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లావ్యాప్తంగా మిని మం టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) డీఎస్‌సీ 2008, 1998 ఉపాధ్యాయులకు సోమవారం తలపెట్టిన బదిలీల్లో జిల్లాలోని అన్ని ఖాళీలను ప్రదర్శించాలని ఎంటీఎ స్‌ ఉపాధ్యాయుల సంఘ నాయకులు డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మను కోరారు. ఈ మేరకు డీఈఓకు వినతిపత్రం సమర్పిస్తూ ఎంటీఎస్‌ ఉపాధ్యాయు లు కొన్నేళ్లుగా సుదూర ప్రాంతాల్లో చాలీచా లని జీతాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. బదిలీల సందర్భంగా జిల్లాలోని అన్నిరకాల ఖాళీలను చూపడం ద్వారా కొందరికై నా న్యా యం జరుగుతుందన్నారు. ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు తోట ఎడ్వర్డ్‌, సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌, సయ్యద్‌ బాజీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement