ఏలూరు (టూటౌన్): పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని రిజర్వేషన్ పెంపు సాధన సమితి నాయకులు కోరారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ప్రైవేట్ హాలులో ఆదివారం రిజర్వేషన్ పెంపు సాధన సమితి ముఖ్య నాయకుల సమావేశం డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నాళ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీ జనాభా ఇరవై శాతం పైగా పెరిగినా ఇప్పటికి అదే రిజర్వేషన్‌న్ అమలు చేయడం చాలా అన్యాయం అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్‌న్స్ పెంచాలని ప్రైవేటు సెక్టార్లలో కూడా అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐఆర్‌ఎస్ చాగంటి సంజీవ్, గంజి మధు, నేతల రమేష్ బాబు, పల్లెం ప్రసాద్, దాసరి నాగేంద్ర కుమార్, సీహెచ్ సాయిరాజ్, పొట్ల సురేష్, ఎరికిపాటి విజయకుమార్, కలపాల రాజ్‌కుమార్, మతి చంద్రప్రసాద్, పాము రవీంద్ర, పెరియార్ పూలే అంబేడ్కర్, ఉప్పే రాజారావు, దాసి వెంకటేశ్వర్లు, పిట్టా నాగేశ్వరావు, అద్దంకి శ్రీమణి పాల్గొన్నారు.


