తాడేపల్లిగూడెం (టీఓసీ): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ఈ.స్వరాజ్యలక్ష్మి అన్నారు. పట్టణ పరిధిలో ఆదివారం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు. ఆమె మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో అనుమతించిన పర్మిట్ రూమ్‌ల్లో మాత్రమే మద్యం సేవించేందుకు అనుమతి ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టప్రకారం చర్యలు, కేసులు నమోదు ఉంటాయని, శిక్షలు అమలు అవుతాయని వివరించారు.
దెందులూరు: గాలాయగూడెం వైపు సైకిల్‌పై వెళుతున్న మట్ట అంజయ్యను వెనుక నుంచి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వైపు వస్తున్న కారు శనివారం నాగులదేవునిపాడు శివారులో అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అంజయ్యను స్థానికులు, బంధువులు ఆటోలో ఏలూరు ఆంధ్ర వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అంజయ్య ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడని ఎస్‌ఐ వెంకట్‌కుమార్ తెలిపారు. మృతి చెందిన అంజయ్య స్వగ్రామం గాలాయగూడెం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


