ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన వీఽధి నవీన్‌కుమార్‌పై రౌడీషీట్ ఉంది. గత నెల ఆకివీడు సీఐ కాళీచరణ్ స్టేషన్‌కు పిలిపించి దారుణంగా కొట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీస్ దెబ్బలు తట్టుకోలేక మే 11న పురుగుల మందు తాగి తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఒంటిపై తీవ్రంగా గాయాలున్నాయని నవీన్‌కుమార్ తల్లి వీధి బుజ్జి సీఐ కాళీచరణ్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ కమిషన్‌కు, డీఐజీకి ఫిర్యాదు చేయగా డీఐజీ విచారణ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పశ్చిమ ఎస్పీకి మృతుడి తల్లి గతనెలలో ఫిర్యాదుకు యత్నించగా స్థానిక పోలీసులు ఇబ్బందులు సృష్టించడంతో మే 18న డీఐజీకి ఫిర్యాదు చేశారు. నిడమర్రుకు చెందిన నండూరి శివ కార్తికేయ (33)తన మేనకోడలి గొలుసు అదే గ్రామానికి చెందిన వ్యక్తి అపహరించాడని ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఎస్సై రెండు కేసులు నమోదు చేశారు. అనంతరం చర్యలు ఎందుకు తీసుకోలేదని శివ కార్తికేయ విధుల్లో ఉన్న ఎస్సైను ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడ జరిగిన తిరునాళ్ళల్లో ఓ యువకుడు కత్తి తిప్పి పరారయ్యాడు. ఇది శివ కార్తికేయ చేశాడని ఎస్‌ఐ విచారణ పేరుతో స్టేషన్ పిలిచి తీవ్రంగా కొట్టి అవమానించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివ కార్తికేయను అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపామని డీఎస్పీ శ్రావణ్ కుమార్ ప్రకటించడం విశేషం.


