తణుకు అర్బన్: భారత్ ఎగుమతుల్లో ఇబ్బందులను తొలగించాలని శాసన మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ అన్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వరల్డ్ ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటెక్స్ ఫెయిర్ ఈవెంట్ ప్రారంభ కార్యక్రమాన్ని పలువురు ప్రముఖులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ నుంచి ఎగుమతి అవుతున్న టెక్స్‌టైల్ రవాణాలో ఉంటున్న ఇబ్బందులను తొలగించాలని, చిట్టగాంగ్ పోర్ట్‌లో దిగుమతులు త్వరితగతిన చేపట్టాలని కోరారు. భారత్‌దేశం నుంచి కాటన్ యార్న్ అత్యధిక శాతం బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతుందని, బంగ్లాదేశ్ కాటన్ వస్త్ర పరిశ్రమలో 85 శాతం భారత నూలు దిగుమతులపై ఆధారపడి ఉందని, పోర్ట్‌లలో కంటైనర్ విడుదలలో జాప్యం తగ్గితే వస్త్ర పరిశ్రమలు ఇబ్బందులు తొలగి త్వరితగతిన గార్మెంట్స్ ఎగుమతులకు మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేశారు.


