పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి

Jun 20 2026 12:30 PM | Updated on Jun 20 2026 12:30 PM

భీమవరం: జిల్లాలోని ఉపాధ్యాయులకు విద్యాశాఖ నుంచి రావాల్సిన పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పీఆర్‌వీఎస్‌ సాయివర్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో ఇ.నారాయణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సాయివర్మ మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఇండక్షన్‌ శిక్షణకు రిసోర్స్‌ పర్సనన్‌గా పనిచేసిన ఉపాధ్యాయులకు ఇంతవరకూ ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో చేసిన ఉపాధ్యాయులకు పారితోషికం లభించలేదన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ రామచంద్రరావు, కార్యదర్శి చుండూరు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement