కనుమరుగవుతున్న తాటిచెట్లు
జిల్లాలో తాటిచెట్లను నరికి ఇటుకల బట్టీల్లో ఇటుకలను కాల్చడానికి వాడుతున్నారు. దీంతో జీవ వైవిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 8లో u
భీమవరం (ప్రకాశంచౌక్): రొయ్య ఫీడు ధరల పెరుగుదల, మార్కెట్ ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా రొయ్యల రైతుల వెల్ఫేర్ ఫెడరేషన్ నాయకులు, ఆక్వా రైతులు కలెక్టరేట్‌లో డీఆర్వో శివన్నారాయాణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ముడి సరుకు ధరలు పెరిగాయనే సాకుతో ఫీడు ధరలు భారీగా పెంచారని, కానీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకు ధరలు తగ్గినపుడు మాత్రం ఫీడు ధరలు తగ్గించడం లేదని, దీంతో వ్యయం భారీగా పెరిగిందని వాపోయారు. పెట్టుబడికి అనుగుణంగా గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కమిటీ వేసి ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు, మళ్ల తులసీ రాంబాబు, గాదిరాజు సుబ్బరాజు, వీరవల్లి చంద్రశేఖర్, ముత్యాల బుజ్జి, తోట విజయ్‌కుమార్, అంగర ప్రసాదు, గంధం కేసుబాబు, భోగిరెడ్డి శ్రీనివాస్, ఎం.శ్రీనివాసరావు, దాసరి మాణిక్యాలరావు, కావలి దాము తదితరులు పాల్గొన్నారు.


