ఆక్వా సంక్షోభానికి ప్రభుత్వానిదే బాధ్యత | - | Sakshi
Sakshi News home page

ఆక్వా సంక్షోభానికి ప్రభుత్వానిదే బాధ్యత

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

మేత ధరలు, విద్యుత్‌ భారం తగ్గించాలి

నరసాపురం రూరల్‌: ఆక్వా సంక్షోభానికి అధికారంలో ఉన్న ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, అప్సడా మాజీ చైర్మన్‌ వడ్డి రఘురామ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నడూ లేని విధంగా రొయ్య రైతుల కన్నీళ్లు ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని, ధరలు అమాంతం పడిపోయి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. సోమవారం మొగల్తూరులోని లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో ప్రసాదరాజు, వడ్డి రఘురాంలు పలువురు రైతులతో మాట్లాడి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రొయ్యల మేత ధరలు పదేపదే పెరిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారన్నారు. మరోపక్క రొయ్యలకు గిట్టుబాటు ధర లేదని, ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ, ఆక్వా వ్యాపారవేత్త చాగంటి సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు పీడీ రాజు, ఎంబీసీ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌ పెండ్ర వీరన్న తదితరులు మాట్లాడుతూ ఆక్వాకు సబ్సిడీ విద్యుత్‌ ఎగ్గొట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు ఏవీ రైతులకు ఉపయోగపడే విధంగా లేవన్నారు. ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌కు రూ 1.50 విద్యుత్‌ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారని, కాలయాపన చేస్తూనే ఉన్నారని విమర్శించారు.

నూతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం

ఆక్వా సాగు నష్టాలతో ఉండటంతో ప్రభుత్వ ప్రోత్సాహం కోసం రైతు సమస్యల పరిష్కారం కోసం తీర ప్రాంత రైతులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర స్థాయి నూతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యల సాధనకోసం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యలను శాసనసభలో ప్రస్తావించేందుకు వినతిపత్రం అందించనున్నట్టు రైతు సంఘ నాయకులు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అగ్నికుల క్షత్రియ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తిరుమాని నాగరాజు, జిల్లా మత్స్యకార సొసైటీల సంఘం మాజీ అధ్యక్షుడు అండ్రాజు చల్లారావు, నరసాపురం, మొగల్తూరు, పోడూరు, ఆకివీడు జెడ్పీటీసీలు బొక్కా రాధాకృష్ణ, తిరుమాని బాపూజీ, గుంటూరి పెద్దిరాజు, వేగేశ్న వెంకటరాజు, గుబ్బల నారాయణమూర్తి, చిలుకూరి దత్తాత్రేయవర్మ, దొంగ సత్యనారాయణ, రామచంద్రరాజు, రేవు నారాయణమూర్తి, ఉంగరాల రమేష్‌నాయుడు, గుంటూరి సత్యనారాయణ, కాండ్రేగుల నర్శింహరావు, కంకటాల పెద్దిరాజు, పాలా రాంబాబు, ముక్తేశ్వరరావు, బంధన పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement