భీమవరం: పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశా లల్లో సెలవు రోజు రెండో శనివారం తరగతులు నిర్వహిస్తుండగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అడ్డుకున్నారు. సిగ్ని, సంస్కార్, పూర్ణోదయ, బార్దోలి, భాష్యం తదితర పాఠశాల్లో తరగతులను వారు అడ్డుకుని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.సాయికృష్ణ మాట్లాడుతూ సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఆయా విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవా లని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పి.త్రినాథ్, జి.కౌశిక్, జి.అభి తదితరులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: వైఎస్సార్‌సీపీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా తాను నియమితులైనట్టు మంతెన సోమరాజు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా నియామక పత్రం జారీ చేశారన్నారు. రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు ని యోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా కూ డా తనను నియమించారని తెలిపారు. కాగా మంతెన ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శిగా, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి పెనుగొండ వాసవీ క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 21న జిల్లావ్యాప్తంగా యోగా సంగమ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడానికి ఇంకెంత సమయం కావాలని ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అఽ ద్యక్షుడు టి.నారాయణదాసు ప్రశ్నించారు. శనివారం స్థానిక ఏఆర్‌డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాలలో జిల్లా సమావేశాన్ని నిర్వహించా రు. నారాయణదాసు మాట్లాడుతూ ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని, లేకుంటే కేవలం వారి బోధన సబ్జెక్టుకు సంబంధించి మాత్రమే ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామారావు మాట్లాడుతూ వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలని కోరారు.


