తణుకు అర్బన్: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ర్యాలీపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు హడావుడి చేయగా.. ముందుగానే సమాచారం ఇచ్చామని, ఇప్పుడు అనుమతి లేదంటే కుదరదని, రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలు తణుకులో ఏంటని కారు మూరి నిలదీశారు. దీంతో అడ్డుకుని తీరుతామన్న పోలీసు అధికారులు వేలల్లో తరలివచ్చిన జనాన్ని చూసి చేసేదిలేక వదిలేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీ లో పాల్గొన్న మాజీ మంత్రి కారుమూరితోపాటు 38 మందిపై శనివారం ఉదయం ఎఫ్‌ఐఆర్ వేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేసులు ఇవి.. సెక్షన్ 189 (2) (చట్టవిరుద్ధమైన గుంపు సభ్యులు), సెక్షన్ 190 (చట్టవిరుద్ధమైన గుంపులతో ఉమ్మడి లక్ష్యంతో నేరం), 120 (ఏ) (అక్రమ నిరోధం), 292 (పబ్లిక్ న్యూసెన్స్), 285 (ప్రజా మార్గాలకు అడ్డంకి ఏర్పరచడం), 32 (పోలీసుల ఆదేశాలను ధిక్కరించడం) జరిమానాలతో కూడిన సెక్షన్‌లతో కేసులు నమోదుచేశారు.
ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలతో..
నిరసన ర్యాలీని భగ్నం చేయాలనే ఉద్దేశంతో తణుకు పట్టణ, రూరల్ సీఐలతోపాటు మరో మగ్గురు సీఐలు, 10 మంది ఎస్సైలు సిబ్బందితో హడావుడి చే శారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే అంటూ మాజీ మంత్రి కారుమూరితో సైతం వాగ్వాదానికి ప్రయత్నించారు. అయినా కారుమూరితోపాటు పా ర్టీ శ్రేణులు సంయమనం పాటించి, శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సక్సెస్‌ను జీర్ణించుకోలేక రాజకీయ ఆదేశాలతో కేసులు నమోదుచేశారంటూ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి కారుమూరి, పార్టీ శ్రేణులు సైతం ఎన్ని కేసులు పె ట్టినా భయపడేది లేదని అన్నింటికీ సిద్ధంగానే ఉ న్నామంటూ బహిరంగంగానే చెబుతున్నారు.
మాజీ మంత్రి కారుమూరితో సహా 38 మందిపై కేసులు


