ఫీడ్‌ రేట్ల భారం | - | Sakshi
Sakshi News home page

ఫీడ్‌ రేట్ల భారం

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

ఆలయ అభివృద్ధికి విరాళం ఫీడ్‌ రేట్ల భారం

ఆలయ అభివృద్ధికి విరాళం
కాళ్ల: కాళ్లకూరులో వేంకటేశ్వరస్వామి ఆలయ మాడవీధుల అభివృద్ధికి పచ్చిగోళ్ల అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబసభ్యులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు.

ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌

వీరవాసరం: ఆక్వా రైతు నెత్తిపై ఫీడ్‌ రేట్ల పెంపు మరో పిడుగుపాటు చర్య అని శా సనమండలి సభ్యుడు, వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల ఫీడ్‌ ధరను కిలోకు రూ.10 నుంచి రూ.12 పెంచారన్నారు. ఇప్పటికే ఆక్వా సాగు నష్టాల్లో సాగుతోందని, ఈ సమయంలో మేత ధరలను పెంచడం దారుణమన్నారు. చంద్రబాబు సానుభూతిపరులైన కొందరు ఫీడ్‌ తయారీ కంపెనీల యజమానులు సిండికేట్‌గా మారి రైతులను జలగల్లా పీల్చిపిప్పి చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ హయాంలో రొయ్య రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా అప్సడా ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుని మేలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు రొయ్యల మేత ఫ్యాక్టరీలు, రొయ్యల సీడ్‌ హ్యాచరీ యజమానులు, రొయ్యల ప్లాంట్‌ యజమానులు, రొయ్యల మందులు యజమానులు ఒక్కరే ఉంటూ రేట్లు పెంచుతున్నారని మండిపడ్డారు. అలాగే రొయ్యల ధరలను ఇష్టానుసారం తగ్గించివేయడంతో రైతులు అయినకాడికి అమ్ము కోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ కనుసన్నల్లోనే సిండికేట్‌ వ్యవస్థ నడుస్తుందని ఎమ్మె ల్సీ కవురు ఆరోపించారు. పెంచిన ఫీడ్‌ ధ రలు వెంటనే తగ్గించకుంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రై తులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement