న్యూస్‌రీల్
టిప్పర్ లారీ బోల్తా
ఉంగుటూరు మండలంలోని రాచూరు వద్ద టిప్పరు లారీ తిరగపడి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మోటారు సైక్లిస్టును తప్పించబోయి టిప్పర్ తిరగబడింది. 8లో u
ముసునూరు మండలంలోని వలసపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. 8లో u
బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: సూపర్ సిక్స్ అన్నారు.. అధికారమే పరమావధిగా చంద్రబాబు, పవన్‌న్ కల్యాణ్‌లు అలవికాని హామీలెన్నో ఇచ్చారు. సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి వృద్ధులు, ఆడ బిడ్డలు, నిరుద్యోగులు, కర్షకులు, కార్మికులు.. అన్ని వర్గాల వారిని నిలువునా వంచించారు. విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసి పేదలపై భారం మోపారు. చంద్రబాబు రెండేళ్ల పాలన వైఫల్యాలపై ప్రజల్లో నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశాలకు అపూర్వ స్పందన వచ్చింది. వివిధ వర్గాల ప్రజలు పాల్గొని కూటమి తీరును ఎండగట్టారు.
● నరసాపురంలో..
పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు రౌండ్ టేబుల్ సమావేశానికి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెండేళ్లలో సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై సమావేశంలో చర్చించారు. ప్రసాదరాజు మాట్లాడుతూ జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తామని ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు, ఎంబీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, సోషల్ మీడియా వింగ్ జిల్లా అధ్యక్షుడు బందన పూర్ణచంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బర్రె శ్రీవెంకటరమణ పాల్గొన్నారు.
● పాలకొల్లులో..
నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి రెండేళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిన వంచనపై సమావేశంలో చర్చించారు. మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి శఠగోపం పెట్టిన కూటమి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎన్నిక ఏదైనా గట్టిగా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గోపి మాట్లాడుతూ ప్రచార ఆర్భాటానికే స్థానిక మంత్రి నిమ్మల రామానాయుడుకు సమయం సరిపోవడం లేదని ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి టైం ఎక్కడ ఉంటుందని విమర్శించారు. నియోజకవర్గ పరిశీలకుడు పేరిచర్ల వెంకట నరసింహరాజు, పార్టీ ముఖ్య నేతలు గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు, చెల్లెం ఆనందప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
● భీమవరంలో..
నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశానికి పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమాబాల మాట్లాడుతూ సంపద సృష్టించి పేదలకు పంచుతానని ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని తన సిండికేటుకు దోచిపెడుతున్నారన్నారు. వెంకటరాయుడు మాట్లాడుతూ మహిళలు, నిరుద్యోగులు, రైతులు అన్ని వర్గాల వారిని కూటమి వంచించి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శులు ఏఎస్ రాజు, మేడిది జాన్సన్, యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాలవెల్లి మంగ తదితరులు పాల్గొన్నారు.
● తాడేపల్లిగూడెంలో..
నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డి రఘురామ్‌నాయుడు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని గమిని ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, అరాచకాలు, ఆర్ధిక దుర్వినియోగంపై ఫోటో ఎగ్జిబిషనన్ ఏర్పాటుచేశారు. కూటమి పాలనను నిరసిస్తూ రఘురామ్ నాయుడు పార్టీ శ్రేణులతో కలిసి నల్లబెలూన్‌లు ఎగురవేసి నిరసన తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు పాల్గొని కూటమి పాలన వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తానన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ, రెండేళ్లలోనే రూ. 3.47 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
● ఉండిలో..
పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కూటమి పాలనలో అఘాయిత్యాలు, దౌర్జన్యాలకు సంబంధించిన పోస్టర్స్‌ను ప్రదర్శించారు. జిల్లా ఉపాధ్యక్షుడు పెన్మెత్స ప్రసాదరాజు మాట్లాడుతూ నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, ఎన్నో ఏళ్లుగా ఆయన ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు.
సూపర్ వంచనగా కూటమి రెండేళ్ల పాలన
హామీలు తుంగలోకితొక్కి పేదల్ని నట్టేట ముంచారని మండిపాటు
నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ రౌండ్‌టేబుల్ సమావేశాలు
ప్రజావ్యతిరేక పాలనపై గళం విప్పిన జనం


