కొల్లేరు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

కొల్లేరు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలి గోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి యోగాంధ్ర–2026ను విజయవంతం చేయాలి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 10 మంది అరెస్టు

కై కలూరు: కొల్లేరు ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అన్నారు. తొలి అడుగు పేరుతో కొల్లేరు నాయకుడు బలే ఏసురాజు ఆధ్యరంలో కై కలూరు సీతారామఫంక్షన్‌ హాలులో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు గ్రామ పెద్దలతో మంగళవారం సమావేశం నిర్వహ/ంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ త్వరలో సుప్రీంకోర్టు నుంచి శుభవార్త వస్తుందని భావిస్తోన్నామన్నారు. ఫోన్‌లో ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌తో మాట్లాడించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ త్వరలో కొల్లేరుపై చర్చిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఘంటసాల వెంకటలక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జిల్లా అటవీశాఖ అధికారి త్రిమూర్తులురెడ్డి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న తదితరుల పాల్గొన్నారు.

తణుకు అర్బన్‌: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ, వామపక్షాల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం తణుకు నరేంద్ర సెంటర్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ పెట్రల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సరుకు రవాణా ఛార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటి ప్రజల జీవనం దుర్భంరంగా మారుతుందన్నారు. దేశంలోని ప్రస్తుత దుస్థితికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా వైఫల్యమే కారణమని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, గార రంగారావు, జి.గోపి, బండి సత్యనారాయణ, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో బంగారం మాయం కావడంతో ఆందోళనలో ఉన్న ఖాతాదారులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. జంగారెడ్డిగూడెంలో మంగళవారం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకు వద్ద ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు బ్యాంకు వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల తెలిపిన వివరాలు ప్రకారం ఇప్పటికే రూ.కోటి విలువైన బంగారం మాయమైనట్లు తెలుస్తోందన్నారు. దీనిపై బ్యాంకు అధికారులు సమగ్ర విచారణ చేసి ఖాతాదారులకు న్యాయం చేయాలన్నారు. దీనిపై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆర్‌ఎం, పోలీస్‌ అధికారులతో మాట్లాడానని జెట్టి తెలిపారు. ఆర్‌ఎం స్పందిస్తూ ప్రస్తుతం బ్యాంకులో బంగారం రుణాలపై విచారణ జరుగుతోందని, ప్రతి ఖాతాదారుడికి న్యాయం చేస్తామని, ఇది పూర్తిగా బ్యాంకు బాధ్యత అని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, ఉడా నాగేంద్ర కుమార్‌, గగ్గల కిరణ్‌ కుమార్‌, జుత్తిగ ప్రసాద్‌, పిల్లి రామకృష్ణ, కడిమి కిరణ్‌ పాల్గొన్నారు.

మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి

బంగారం చోరీ

ఏలూరు టౌన్‌: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి బంగారం, సెల్‌ఫోన్‌ చేరీ చేసిన ఘటన మంగళవారం ఏలూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు అశోక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పర్వతనేని సాయినవీన్‌ బీటెక్‌ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. నవీన్‌ తన స్నేహితుడితో కలిసి దేవి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు మద్యం తాగేందుకు వెళ్లాడు. మద్యం తాగుతున్న సమయంలోనే నవీన్‌కు అతడి స్నేహితునికి మద్య చిన్న వివాదం ఏర్పడటంతో బార్‌ నుంచి అతను వెళ్లిపోయాడు. నవీన్‌ ఒక్కడే బార్‌ నుంచి బయటకు వచ్చాడు... ఇదే సమయంలో మోటారు సైకిల్‌పై వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడిని అశోక్‌ నగర్‌లో దించుతామని చెప్పి ఎక్కించుకున్నారు. అయితే వారు చొదిమెళ్ల వైపు తీసుకువెళ్తూ గట్టిగా అరవకుండా నోరు మూసేశారు. అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ తీసుకుని ఉడాయించారు. ఇద్దరు వ్యక్తులు పారిపోతూ వంగూరు వెళదామని చెప్పుకోవటం తాను విన్నానని నవీన్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఏలూరు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యోగాంధ్ర–2026 కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 4.5 లక్షల మంది పౌరులతో యోగ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జూన్‌ 13న నరసాపురం వలందర్‌ రేవు వద్ద 1000 మందితో, జూన్‌ 14న వాసవి పెనుగొండలో 2500 మందితో, జూన్‌ 19న స్పోర్ట్స్‌ అథ్లెటిక్స్‌ మైదానంలో 1500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో 1500 మందితో మెగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: మండలంలో మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్‌ ఎస్సై రవికుమార్‌ మంగళవారం విలేకరులకు ప్రజాప్రదేశాల్లో మద్యం సేవించడం, గొడవలు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించడం వంటివి చట్టరీత్యా శిక్షార్హమని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement