
10న జిల్లా స్థాయి యోగాసన పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యోగాసనా భారత్ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన ఏలూరు జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు వెంకటేష్ గురూజీ తెలిపారు. మంగళవారం స్థానిక గుప్తవిద్య, దివ్యజ్ఞాన సమాజం మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక తూర్పువీధి మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయంలో యోగాసన పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పోటీల్లో 10 నుంచి 55 ఏళ్ల వయసు గల సీ్త్ర, పురుషులు పాల్గొనవచ్చునన్నారు. యోగాసన భారత్ అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వర రావు మాట్లాడుతూ పోటీదారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, అలాగే పోటీలో పాల్గొనే ఒక్కో విభాగానికి రూ. 100 రుసుము చెల్లించాలన్నారు. వివరాలకు ఏలూరు జిల్లా యోగాసనా భారత్ కార్యదర్శి మోటమర్రి మల్లికార్జున రావు 98486 11744, కోశాధికారి సాంబశివరావు 94907 34033 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
3న అథ్లెటిక్స్ జిల్లా జట్టు ఎంపిక
ఏలూరు రూరల్: ఆగస్టు 9, 10, 11 తేదీల్లో బాపట్లలో రాష్ట్రస్థాయిలో అంతర జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయని ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఏలూరు జిల్లా బాలబాలికల జట్లను ఆగస్టు 3వ తేదీన ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జట్టు ఎంపిక చేపడతామన్నారు. అండర్ 14,, 16, 18, 20 విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు పుట్టినతేదీ, ఆధార్, ఎస్‌ఎస్‌సీ మార్క్‌లిస్ట్‌తో హాజరై రూ.200 ఎంట్రీ ఫీజు చెల్లించి పోటీల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. వివరాలకు 62814 31202 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
డిప్లమో హార్టీకల్చర్‌లో చేరికకు నెలాఖరు వరకే అవకాశం
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిఽధిలోని కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో డిప్లమో హార్టీకల్చర్‌లో చేరడానికి ఈనెల 31వ తేదీ ఆఖరు అని రిజిస్ట్ట్రార్ బి.శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. విశ్వవిద్యాలయ పరిధిలో నాలుగు, వర్సిటీ గుర్తింపు పొందిన మూడు పాలిటెక్నికల్ కళాశాలలో డిప్లమో హార్టీకల్చర్ , ల్యాండ్‌స్కేపింగ్, నర్సరీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరడానికి మాన్యువల్ కౌన్సిలింగ్‌కు హాజరు కావాలన్నారు. ఇంతకు మునుపు నమోదు చేసుకున్న అభ్యర్థులతో పాటు , కొత్తగా నమోదు చేసుకున్న దరఖాస్తు దారులు ఈనెల 31వ తేదీ ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తుది విడత కౌన్సిలింగ్ వెంకట్రామన్నగూడెంలో జరుగనుందన్నారు. విద్యార్థులు స్వయంగా తగిన ధ్రువపత్రాలతో వచ్చి కౌన్సిలింగ్‌కు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలు, సీట్ల ఖాళీల సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
మొరాయించిన ఆర్టీసీ బస్సు
ఉండి: భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై మహదేవపట్నం సత్రం వద్ద మంగళవారం మొరాయించింది. భీమవరం నుంచి గణపవరం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లే ఈ బస్సు బయలుదేరి సరిగ్గా ఐదు కిలోమీటర్లు కూడా ప్రయాణించకుండానే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులో మహిళా ప్రయాణికులు, విద్యార్థులు ఉండడంతో గమ్యం చేరేందుకు వారు చాలా ఇబ్బందిపడ్డారు. బస్సులను పరిశీలించకుండానే డిపోనుంచి సర్వీసులకు అధికారులు పంపించేస్తున్నారంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.