
గృహ నిర్బంధాలు దారుణం
పెనుగొండ: పేదలపై జరిగిన దాడులను ఎదరించి నిలబడితే, గృహ నిర్బంధాలు చేయడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ అన్నారు. ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం ధర్మపురి అగ్రహారం దళితుల ఇళ్ల కూల్చివేత తగదంటూ పోరాటం చేయడానికి వెళుతుంటే ఆచంట వేమవరంలో పుష్పరాజును గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు, హోం మంత్రి అనిత పర్యటన సందర్భంగా తనను హౌస్ అరెస్ట్ చేసినట్లు పుష్పరాజ్ తెలిపారు. ఉద్యమాలను అణచి వేయలేరన్నారు. పేదల ఇళ్లు తొలగించడం దారుణమని, వారికి పక్కా స్థలాలు చూపించి, ఇళ్ల నిర్మాణం చేపట్టే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
సంగీత దర్శకుడు గణేష్‌కు జాతీయ అవార్డు
దెందులూరు: తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి నాటక పోటీల్లో దెందులూరుకు చెందిన సాయి గణేష్ చారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా హనుమాన్ అవార్డు లభించింది. అభినయ అరూట్స్ ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఈ పోటీలు నిర్వహించింది. పోటీల్లో హేలపురి కల్చర్ల అసోసియేషన్ ప్రదర్శించిన సారీ రాంగ్ నెంబర్ అనే సాంఘిక నాటికకు సాయి గణేష్ చారి సంగీతం అందించి ఉత్తమ సంగీత దర్శకుడిగా హనుమాన్ అవార్డును కై వసం చేసుకున్నారు. అభినయ ఆరూట్స్ కార్యదర్శి బి.ఎన్.రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అవార్డులు అందజేశారు.

గృహ నిర్బంధాలు దారుణం