
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
పాలకొల్లు సెంట్రల్: మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పాలకొల్లు మండలంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జొన్నల గరువు గ్రామానికి చెందిన కట్టా నవీన్ కుమార్ (19) ఆగర్తిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. దీనిపై యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పగా ఆ యువకుడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ కుమార్ ఆదివారం రాత్రి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి కట్టా శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి సురేంద్ర కుమార్ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఉండి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి మండలం పాములపర్రు శివారు రామాపురంలో ఆదివారం ఉదయం వ్యాన్ ఢీకొనడంతో సప్పా సుబ్రహ్మణ్యం (44) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.