సుప్రీం ఆదేశాలూ లెక్కచేయక.. | - | Sakshi
Sakshi News home page

సుప్రీం ఆదేశాలూ లెక్కచేయక..

Jul 29 2025 4:29 AM | Updated on Jul 29 2025 10:29 AM

సుప్రీం ఆదేశాలూ లెక్కచేయక..

సుప్రీం ఆదేశాలూ లెక్కచేయక..

హైకోర్టు ఉత్తర్వులున్నా బేఖాతరు

ఇదే విధంగా గతంలో నిడమర్రుకు చెందిన వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్త బేతు సతీష్‌పై భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి హడావుడిగా అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులోనూ న్యాయమూర్తి ఆదేశాలతో పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. పెదపాడులో పోలీసుల అరాచకం తారాస్ధాయిలో ఉంది. ప్రైవేటు వ్యవహారాలు, హైకోర్టు ఉత్తర్వులున్న సివిల్‌ వ్యవహారాల్లో సైతం తలదూర్చడంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పెదపాడు మండలం గుడిపాడులో 6 ఎకరాల ప్రైవేటు భూమిలో భూ యజమాని చేపలు, రొయ్యల చెరువులు సాగుచేస్తున్నారు. స్ధానిక టీడీపీ నేతలతో భూ యజమానికి రాజకీయంగా విభేదాలున్నాయి. చెరువు యజమాని వైఎస్సార్‌సీపీ పార్టీకి చెందినవాడు కావడంతో పట్టుబడుల సమయంలో అడ్డగించడం, రహదారులను ధ్వంసం చేసి వాహనం బయటకు వెళ్లనీయకుండా చేయడంతో పాటు ఎస్సై శారదా సతీష్‌ రమ్మంటున్నారని స్టేషన్‌కు పిలిపించి చేస్తూ తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. సదరు చెరువు యజమాని చేపలు పట్టుకోవడానికి తహసీల్దార్‌, ఎస్సై తగిన ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా వాటిని అమలు చేయకుండా టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తడం వివాదాస్పదంగా మారింది.

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార పార్టీ నాయకుడు చెబితే అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. కనీసం ఫిర్యాదు ఉందా.. దానిపై విచారణ చేశామా.. చేస్తుంది న్యాయమా, అన్యాయమా ఇలాంటి సహజ న్యాయసూత్రాలను విస్మరించి అధికార పార్టీ నేతలు చెబితే అడ్డగోలుగా అక్రమ నిర్భంధాలు, రకరకాల కేసుల పేరుతో వేధింపులకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం తెరతీసింది. జిల్లా పరిధిలో కొన్ని పోలీస్‌ స్టేషన్లలో ఈ తరహా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని కొందరు ఎస్సైలు ప్రజాప్రతినిధుల మెప్పుకోసం అమలు చేస్తూ తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. తాజాగా అక్రమ నిర్బంధం కేసుపై పెదవేగి ఎస్సై న్యాయమూర్తి మెమో జారీ చేశారు. గతంలోనూ భీమడోలు పోలీసుల అత్యుత్సాహంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు.

పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధింపులు

జిల్లాలో అధికార పార్టీ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. రెడ్‌బుక్‌ పేరుతో దెందులూరు, యలమంచిలి, భీమడోలు ఇలా కొన్ని ప్రధాన పోలీస్‌స్టేషన్లల్లో పోలీసుల మితీమిరిన అత్యుత్సాహం సమస్యాత్మకంగా మారింది. కేవలం టీడీపీ నేతలు చెప్పా రని ఫిర్యాదు లేకుండా రోజులు తరబడి వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి.

తాజాగా గత వారం వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సోదరులు చల్లగోళ్ళ తేజ, ప్రదీప్‌లను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ముందస్తుగా సమాచారం ఇవ్వడం పోలీసుల ప్రాథమిక విధి. 2024 జనవరిలో జరిగిన ఘర్షణపై అదే సంవత్సరం మేలో కేసు నమోదు చేయడం, ఆ కేసులో 2025 జూలైలో అరెస్టులు చూపడం కేవలం రాజకీయ కక్షతోనే జరిగింది. ఈ క్రమంలో కోర్టులో కూడా తెల్లవారుజాము వరకు వాదనలు జరిగాయి. పాత కేసుల్లో ఇప్పుడు అరెస్టు చేయడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసి పెదవేగి ఎస్సై రామకృష్ణకు మెమో జారీ చేశారు.

రెడ్‌బుక్‌ వేధింపుల్లో పోలీసులదే కీలకపాత్ర

సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్న వైనం

పెదవేగి ఎస్సైకు మెమో జారీ చేసిన న్యాయమూర్తి

గతంలో భీమడోలు పోలీసులు కూడా ఇదే తరహా అత్యుత్సాహం

జిల్లాలో పెరుగుతున్న రెడ్‌బుక్‌ వేధింపులు

యలమంచిలిలో మరీ అత్యుత్సాహం

యలమంచిలిలో ఈ ఏడాది మే 19న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పోలీసుల తీవ్ర అత్యుత్సాహం రాష్ట్ర స్ధాయిలో చర్చనీయాంశంగా మారింది. అధికార టీడీపీకి ఎలాంటి బలం లేనప్పటికీ మంత్రి నిమ్మల రామానాయుడు డైరెక్షన్‌లో పోలీసులు హడావుడి చేసి ఓటింగ్‌నే అడ్డుకోవాలని ప్రయత్నించారు. అది కూడా కోర్టు ఆదేశాలతో జరుగుతున్న ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం చర్చగా మారింది. ఎంపీటీసీ కంభాల సత్యశ్రీ కనిపించడం లేదని తన కుమార్తె ఫిర్యాదు చేసిందనే సాకుతో ఓటింగ్‌కు వచ్చిన ఆమెను స్టేషన్‌కు తీసుకువెళ్లడానికి బలంగా ప్రయత్నించిన క్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అయినప్పటికీ ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్‌లారు. కేవలం ఎన్నికలు వాయిదా వేయించడానికి ఈ తరహా ఎత్తుగడ రాజకీయంలో మహిళా ప్రజాప్రతినిధిని ఇబ్బంది పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement