ఉచితం పరిమితం | - | Sakshi
Sakshi News home page

ఉచితం పరిమితం

Jul 30 2025 6:42 AM | Updated on Jul 30 2025 6:42 AM

ఉచితం

ఉచితం పరిమితం

కౌలు రైతులందరికీ రుణాలివ్వాలి

బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025

కండిషన్‌ అంతంత మాత్రమే

పల్లె వెలుగు హైర్‌ సర్వీసులతో పోలిస్తే మిగిలిన వాటి కండిషన్‌ అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు కుదుపులు, కిటికీల తలుపుల నుంచి వచ్చే శబ్దాలకు తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వస్తుందని ప్రయాణికులు అంటున్నారు. సిబ్బంది కొరత అధికంగా ఉంది. అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా డ్రైవర్లను భర్తీచేసే యోచనలో అధికారులు ఉన్నారు. పనిభారం పెరిగినప్పుడు కండక్టర్లను డబుల్‌ డ్యూటీ చేయించాలని భావిస్తున్నారు.

ఈ రూట్లలో మాటేంటి ?

ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం ద్వారా జిల్లాలోని ఆర్టీసీ రోజుకు రూ.40 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. భీమవరం–రాజమహేంద్రవరం, భీమవరం–తాడేపల్లిగూడెం, భీమవరం– తణుకు, భీమవరం–నరసాపురం, భీమవరం–ఏలూరు రూట్లు ఆర్టీసీకి ఆదాయాన్ని తెస్తున్నాయి. భీమవరం డిపోలోని గణపవరం రూట్‌, నరసాపురంలోని దొడ్డిపట్ల, కందరపల్లి, చినగొల్లపాలెం రూటు, తణుకులోని వరిగేడు, పసలపూడి రూటు, తాడేపల్లిగూడెంలోని అప్పారావుపేట, సింగరాజుపాలెం, పోల వరం రూట్లు ఆదాయం లేని రూట్లుగా ఉండటంతో వీటికి సర్వీసులు అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. ఆదాయం లేని రూట్లలో మహిళల ఉచిత ప్రయాణానికి అదనపు బస్సులు ఏర్పాటు చేస్తారో లేదో వేచిచూడాలి.

సాక్షి, భీమవరం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచితం ప్రయాణమని ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. ఉచిత బస్సు హామీకి ఏడాది ఎగనామం పెట్టిన చంద్రబాబు సర్కారు రానున్న ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామంటోంది. ఉచిత ప్రయాణం జిల్లా వరకే పరిమితమంటూ చేతులెత్తేసింది. కూటమి సూపర్‌సిక్స్‌ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఒకటి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం తదితర సభల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మాట్లాడుతూ రాష్ట్రమంతటికీ వర్తింపచేస్తామంటూ హామీ ఇచ్చిన విషయం విదితమే. రానున్న ఆగస్టు 15 నుంచి ఈ హామీని అమల్లోకి తేనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు సర్వీసులు నడిపే దిశగా ఆర్టీసీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆంక్షల నడుమ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని మొత్తం బస్సులు రోజుకు లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుండగా, 90 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో జిల్లా పరిధిలో ప్రయాణిస్తున్న వారు దాదాపు 70 శాతం మంది ఉంటారు. మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో ఈ ఆక్యుఫెన్సీ మరో 15 నుంచి 20 శాతం పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, ఉద్యోగులతో రద్దీ అధికంగా ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణంతో ఈ రద్దీ మరింత పెరగనుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో లోకల్‌ సర్వీస్‌ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 23 స్పేర్‌ బస్సులు, 22 బడి బస్సుల్లో దాదాపు 30 బస్సులను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా రద్దీని అధిగమించే యోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

జిల్లాలో బస్సులు ఇలా..

జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల పరిధిలో మొత్తం 295 బస్సులు ఉన్నాయి. వీటిలో దూరప్రాంతాలకు వెళ్లే వెన్నెల, స్టార్‌ లైనర్లు నాలుగు, ఇంద్ర బస్సులు 11, సూపర్‌ లగ్జరీ బస్సులు 33, అల్ట్రా డీలక్స్‌లు 26, ఎక్స్‌ప్రెస్‌లు 20 వరకు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల మధ్య సేవలందిస్తున్న అల్ట్రా పల్లె వెలుగులు 19, పల్లె వెలుగు బస్సులు 158 ఉండగా, స్పేర్‌ బస్సులు 23 ఉన్నాయి. జిల్లాలోని మొత్తం బస్సుల్లో వెన్నెల సర్వీస్‌తో పాటు ఒక అల్ట్రా డీలక్స్‌, తొమ్మిది ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, 17 అల్ట్రా పల్లె వెలుగు, 47 పల్లె వెలుగు బస్సులను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మహిళల జనాభా 9.23 లక్షలు. ప్రస్తుతం వీరి సంఖ్య మరింత పెరిగింది. జిల్లాలో 409 పంచాయతీలకు దాదాపు 300 గ్రామాలకు మాత్రమే ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణించాలంటే ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌లగ్జరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. వీటికి అనుమతి ఇవ్వకుండా కేవలం పల్లె వెలుగు బస్సులకు మాత్రమే అనుమతించడం సరికాదని మహిళలు మండిపడుతున్నారు. అదనపు బస్సులు లేకుండా ఉన్న వాటినే సర్దుబాటు చేయడం తూతూమంత్రంగా ఎన్నికల హామీని అమలుచేయడమేనని విమర్శిస్తున్నారు.

సిద్ధంగా ఉన్నాం

మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రానప్పటికి సిద్ధంగా ఉన్నాం. బస్సులను పూర్తి కండీషన్‌లోకి తెచ్చాం. ప్రస్తుతం స్పేర్‌లో ఉన్న వాటిని, బడి బస్సులను వినియోగంలోకి తీసుకువచ్చి అవసరాన్ని బట్టి అదనపు బస్సుల కోసం ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నాం. సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.

– ఎన్‌వీఆర్‌ వరప్రసాద్‌, జిల్లా ప్రజా రవాణ అధికారి, భీమవరం

న్యూస్‌రీల్‌

రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమంటూ హామీ

ఇప్పుడు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగులకే పరిమితం?

జిల్లాలో 9.23 లక్షల మహిళలకు ఉన్న బస్సులు కేవలం 184

ఆర్టీసీ బస్సులు వెళ్లని గ్రామాలు 100 పైనే

ఉచితం పరిమితం1
1/3

ఉచితం పరిమితం

ఉచితం పరిమితం2
2/3

ఉచితం పరిమితం

ఉచితం పరిమితం3
3/3

ఉచితం పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement