
పరదాలు, కాపలా అక్కరలేదంటూనే..
ఆకివీడు: హోం శాఖమంత్రి వంగలపూడి అనిత సోమవారం ఆకివీడు పర్యటన సందర్భంగా సామాన్యులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డుకోవడం, ఆర్టీసీ బస్సులను దారి మళ్లించడంతో ప్రజానీకానికి ఇబ్బందులు తప్పలేదు. కానీ స్థానిక వెలంపేట రామాలయం వద్ద జరిగిన సభలో హోం మంత్రి వనిత మాట్లాడుతూ తమ పర్యటనలో పరదాలు అక్కరలేదు, చెట్లు కొట్టక్కరలేదు, షాపులు మూయ్యక్కరలేదు, పైన పోలీసులు కాపలా కాయక్కరలేదు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యంగ్యంగా మాట్లాడడం గమనార్హం. తమ ప్రభుత్వంలో బయటకు వస్తే ప్రశాంతంగా బతకవచ్చని హోం మంత్రి అనిత చెబుతున్నా ఆమె పర్యటన కారణంగా ప్రయాణికులు, స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. రోపులు, వైరు తాడులు ఉపయోగించి నాయకులను, స్థానికుల్ని అడ్డుకోవడం కొసమెరుపు. ఉదయం 10 గంటలకు వస్తారని పోలీసులు హడావిడి చేసినా మధ్యాహ్నం 12.30 గంటలకు ఆమె రావడంతో సభా వేదిక వద్ద ఉన్న డ్వాక్రా మహిళలు నీరసించి, విసుగుచెందారు.
హోం మంత్రి పర్యటనలో హంగామా
ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు

పరదాలు, కాపలా అక్కరలేదంటూనే..

పరదాలు, కాపలా అక్కరలేదంటూనే..