ఇంటర్ ఫలితాల్లో ‘శశి’ సత్తా
ఉండ్రాజవరం: ఇంటర్–2025 ఫలితాలలో వేలివెన్ను శశి క్యాంపస్ విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ఫలితాలతో సత్తా చాటారని విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శనివారం తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కె.సాత్విక్ వర్మ, బి.షన్మిత, డీపీబీ బంగారం 990, ఎస్‌జేఎం దీపిక, బి.స్నేహ, జిఎస్.వైష్ణవి, కె.నంద కార్తిక్ 989 మార్కులు, ఏజేఎస్ రమాదేవి, ఎస్.హేమలత, పీఎల్ ప్రసన్న, సీహెచ్.పవన్‌కుమార్, ఎస్.రేఖ 988 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో కె.లీలా వినోదిని 990, జి.చెరిష్ సాయి, పి.ధరణి 989, టి.కీర్తి 988 మార్కులు సాధించారు. 990 మార్కుల పైన నలుగురు, 980 మార్కులపైగా 179 మంది, 950 మార్కులపైగా 811 మంది, 900 మార్కులపైగా 1402 మంది సాధించారని ఆయన తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎస్.నాగపూజిత్, వై.రాహుల్, టి.నారాయణ మూర్తి, ఎం.శైలజ, పి.సాయి చరణ్, సీహెచ్.వినీల, కె.కాళీశ్వర, టి.మణికంఠ, ఎం.సాయిలక్ష్మి, బి.సాత్విక్, ఎస్‌వి.తేజశ్విని, సయ్యద్ అనస్, ఎన్.చాతుర్ వర్మ, యు.ధీరజ్ కుమార్, ఎండి.తహ్‌లీల్ సామా 466 మార్కులు, బైపీసీలో ఎల్.దినేష్, జి.భవ్య, ఎస్.స్వర్ణాంజలి, పి.సుష్మ 435 మార్కులు సాధించారు. 465 మార్కులు పైన 50 మంది, 460 మార్కుల పైన 264 మంది, 430 మార్కులు పైన 1070 మంది, 400 మార్కుల పైన 1567 మంది సాధించారని ఆయన తెలిపారు. ఫలితాల సాధనకు కృషి చేసిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని విద్యాసంస్థల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మి సుప్రియ అభినందించారు.


